స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన తర్వాత తన హృదయం బరువెక్కింది, స్టాలిన్ పేర్కొన్నారు. అద్భుతంగా సినిమాను తెరకెక్కించిన దర్శకనిర్మాతలకు నటీనటులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సినిమా తన పై ఎంతో ప్రభావం చూపిందని అన్నారు.