టి.పి.టి.ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు..

277

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు.

మెదక్ 5 జనవరి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హవేలీ ఘణపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపల్లి పాఠశాలలో నూతన సంవత్సర (టి.పి.టి.ఎఫ్) క్యాలెండర్ ను ఆవిష్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ మధుమోహన్.ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు కాముని రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 3 విడతల డీఏలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా బదిలీలు, పదోన్నతులకు సంబంధించి నటువంటి షెడ్యూల్ వెంటనే విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి ఎల్.దేవి సింగ్, హవేలీ ఘన్పూర్ మండల శాఖ అధ్యక్షుడు కే సత్యనారాయణ, కే.రాజు,స్వామి కుమార్, పి.నరేందర్, సురేష్ కుమార్, నగేష్, శివరాములు, వెంకటేశ్వర్లు, గణేష్, సంజీవ్ కుమార్,శ్రీలత,అమృత, సౌజన్య,గిరిజ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి