28.7 C
Hyderabad
Friday, April 12, 2024
హోమ్తెలంగాణడివిజన్లవారీగా షీటీమ్స్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

డివిజన్లవారీగా షీటీమ్స్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

డివిజన్లవారీగా షీటీమ్స్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

యదార్థవాది ప్రతినిది సిద్ధిపేట

సిద్దిపేట జిల్లాలో ఉన్న షీటీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీటీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై బస్టాండ్లలో మార్కెట్లలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన వివరాలను వివరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత.. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేశారని, మహిళల, బాలికల, విద్యార్థిని విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని, 100 ఫోన్ వస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్తున్నామని, ప్రజల బద్రత దృశ్య సీసీ కెమెరాలు పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని తెలిపారు. షీటీమ్ కంప్లైంట్ కొరకు QR కోడ్ గుర్చి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో RTC బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని, ఎవరైనా వేధించిన గురి చేస్తే షీటీమ్ వాట్సప్ నెంబర్ 7901640473, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 పెళ్లయిన మహిళలు శారీరకంగా మానసికంగా గృహహింసకు గురైతే వెంటనే స్నేహిత మహిళ సపోర్ట్ సెంటర్ 9494639498 ఫోన్ చేసినచో (ఫేస్ బుక్ (మెయిల్ [email protected]), (ట్విట్టర్ @sdptsheteam) పిర్యాదు చేసినచో, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను సిద్దిపేట కమిషనరేట్ లో ప్రారంభించడం జరిగిందని, మహిళల, మనుషులు అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని కమిషనర్ తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ.బి దుర్గా, ఆధ్వర్యంలో షీటీమ్స్ బృందాలు పనిచేయడం జరుగుతుందని, మహిళా పోలీస్ స్టేషన్ సాంబయ్య ఎస్ఐ, షీటీమ్ సిబ్బంది మమ్మద్ ముజీబ్ హైమద్, ఏఎస్ఐ,, అమృత్, ఏఎస్ఐ,, మల్లేశం, ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, మహిళ కానిస్టేబుళ్లు పద్మ, సంగీత, జ్యోతి, రజిత, కానిస్టేబుళ్లు స్వామి, ప్రకాష్, రవి, యుగేందర్, అన్వేష్. దుద్యా నాయక్, షీటీమ్స్ డివిజన్లో వారిగా విధులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.


RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్