30.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్డ్వాక్రా గ్రూపులో దోపిడీ దారులు?

డ్వాక్రా గ్రూపులో దోపిడీ దారులు?

డ్వాక్రా గ్రూపులో దోపిడీ దారులు?

నిర్లక్షరాస్యులైన గ్రూప్ సభ్యులకు తెలియకుండానే వారిపై లోన్లు?

పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమా?

సి.ఏ.ల విధులేంటి?

యధార్థవాది ఐనవోలు

గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పొదుపు ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. మహిళలు ఒక సమూహంగా ఏర్పడి తమకు తాము అభివృద్ధి చెందే ఉద్దేశ్యంతో 1982 లో ఇది కార్యరూపం దాల్చింది. ప్రస్తుత సమాజంలో డ్వాక్రా పాత్ర గణనీయంగా ఉంది. ఈ సంఘాలపై ఆధారపడి అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇదే క్రమంలో మహిళ సంఘాల్లో ఉద్యోగ కల్పన జరిగి వేలాది మందికి ఉపాధి సైతం దొరికింది. అయితే క్షేత్ర స్థాయిలో మూల స్తంభాలుగా ఉన్న మహిళలు డ్వాక్రా సంఘాలు ప్రజాప్రతినిధులు, నిరక్షరాస్యత, అవగాహన లేమి వల్ల పలు చోట్ల మోసాలకి గురువుతున్నారు. ఇటీవలే మండలంలోని ఓ గ్రామనికి చెందిన సీ.ఏ లక్ష రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం చేసిన సంఘటన మండల వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో, సాధారణ మహిళల్లో పలు అనుమానాలు ఏర్పడ్డాయి. మా గ్రూపులో కూడా ఇలా జరిగిందంటూ ఒకరు….మా గ్రూపు లో కూడా ఇలానే జరిగిందంటూ మరొకరు చర్చించడం గమనార్హం…

సి.ఏ ల విధులేంటి..?

గ్రామ సమైక్య సంఘాల ద్వారా సి.ఏ లు, వివో సంఘాలు తద్వారా మండల స్థాయిలో మండల సమైక్య కార్యాలయం జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా విధులు నిర్వహిస్తుంది. ఇదంతా క్షేత్ర స్థాయిలో మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించడమే పని చేస్తున్నాయి. అయితే మహిళా సంఘాలకు క్షేత్ర స్థాయిలో బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడంలో సి.ఏ లు ప్రాథమిక పాత్రను పోషిస్తారు. వీరు సమైక్య సంఘం లీడర్, సభ్యులకి బ్యాంకుకు మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తారు. వీరి ఆధీనంలో పదుల సంఖ్యలో సమైక్య సంఘాల పొదుపులు, రుణాల పద్దుల నిర్వహణ చేస్తున్నారు. వివిధ రకాల రికార్డులు వీరు రాయడం, అలాగే వాటిని వీరికి ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన టాబ్‌లో నమోదు చేయడం చేయాలి. అలాగే ప్రతి నెల డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహించి వాటి ఫొటోస్, వివరాలు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు స్త్రీ నిధి, ఇతర లింక్ బ్యాంక్ లోన్లు ఇప్పించే బాధ్యతని వీరు నిర్వహిస్తారు .

నిధుల దుర్వినియోగం ఇలా..

సీ.ఏగా పని చేసే వారికి క్షేత్ర స్థాయిలో ప్రతి మహిళతో నేరుగా పరిచయం ఉంటుంది. ఇదే క్రమంలో మహిళల్లో నిరక్షరాస్యత, అప్పు అంటే భయం ఉండడంతో కొంతమంది సి.ఏ లు రాసిందే లెక్క, చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్‌లో అప్పు అవసరం లేని వారి పేరు మీద డబ్బులు తీసుకోవడం, వాడుకోవడం, తిరిగి చెల్లించకపోవడం వీరికి పరిపాటిగా మారింది. బ్యాంక్ సిబ్బంది కూడా కట్టేది లేనిది కూడా చూసి చూడనట్లు ఉండడం లేదా ఉన్న డబ్బుల్లోనే సి.ఏ లే సర్దుబాటు చేసి ఎప్పటికప్పుడు నెట్టుకొస్తున్నారు. వీరు పుస్తకాలు అప్డేట్ చేయకున్నా తీసుకునే చర్యలు లేవు. పర్యవేక్షించే వ్యవస్థ సరిగా పని చేయట్లేదు.ఇక లోన్‌ల కోసం సదరు సి.ఏ లు కొంతమంది లేని సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీనికి తోడు రుణాలు ఇప్పించినప్పుడల్లా సభ్యుల నుండి మంచితనంతో కొందరు డిమాండ్ చేసి రూ.500 నుండి రూ.1000 వరకు కమిషన్ తీసుకుంటున్నారు. ఇక స్త్రీ నిధి లోన్ అయితే అవతల వారి అవసరం బట్టి వీరి ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్