తక్షణమే పరిష్కరించాలి
సిరిసిల్ల: 2 జనవరి
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సంబంధిత అధికారుల ఆదేశించారు.. జిల్లా సమీకృత కార్యాలయం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఇన్ భీమ్య నాయక్ లతో కలెక్టర్ ప్రజల నుండి పిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలతో ఎన్నో వ్యాయాప్రయసాలకు ఓర్చుకోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా నలుమూలల నుండి వస్తుంటారు వారి సమస్యలు తక్షణమే పరిష్కరిస్తే ప్రజలు కొంతయనం చెందుతారని మన వంతు బాధ్యతగా అధికారులు తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదు వచ్చాయి ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ టి శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డిఓ పవన్ కుమార్, కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
