31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణతెలంగాణ పథకాల ప్లెక్సీతో వినుత ప్రచారం చేసిన వీరాభిమాని.

తెలంగాణ పథకాల ప్లెక్సీతో వినుత ప్రచారం చేసిన వీరాభిమాని.

తెలంగాణ పథకాల ప్లెక్సీతో వినుత ప్రచారం చేసిన వీరాభిమాని.

కరీంనగర్ యదార్థవాది ప్రతినిది

కరీంనగర్ ను గొప్పగా అభివ్రుద్ది చేసిన గంగుల కమలాకర్ గెలవాలి, రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని స్వచ్ఛందంగా ప్లెక్సీ దరించి మైక్ తో వినూత్న ప్రచారం చేస్తున్న సిద్దిపేట జిల్లా చేర్యాల వాస్తవ్యుడు మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పేదింట దేవుడులా వారి అవసరాల్ని అడక్కుండానే తీర్చడానికి కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తగా రంగంలోకి దిగి కరీంనగర్ నియోజకవర్గాన్ని మంత్రి గంగుల అభివ్రుద్ది చేస్తున్న తీరుతో నగరంలో విస్రుతంగా తిరుగుతూ బీఆర్ఎస్ చేసిన మంచిని గంగుల చేసిన అభివ్రుద్దినీ తనదైన శైలిలో వివరిస్తుననాని తెలిపారు. కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ ఇంటింటికి నీళ్లు రైతుబందు ఆరోగ్యశ్రీ కేసీఆర్ కిట్ వంటి సర్కార్ చేపట్టిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం పేదలకు ఎలా ఉపయోగపడుతుందొ వివరిస్తుంటే ప్రజలు ఆసక్తిగా వింటున్నారని కరీంనగర్ కోసం కాళ్లు విరగొట్టుకున్నాడని పట్టిన పట్టు విడవడని నగరం కోసం తన సర్వస్వం దారపోస్తాడని అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడని గంగులని కొనియాడిన మనోహర్ పుట్టిన బిడ్డ నుండి  పండు ముసలి వరకూ సైతం గంగుల చేసిన మంచిని గుర్తిస్తారన్నారు తన బందువులంతా కరీంనగర్లో ఉన్నారని వారంతా గంగుల చేస్తున్న అభివ్రుద్ది గురించి చెప్పారని తను సైతం ప్రత్యక్షంగా చూసానని కరీంనగర్ బీముడని మంచిని పంచే గంగుల గెలవాలని తను విఘ్నేశ్వరున్ని ప్రార్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేసాడు. తన స్వంత ఖర్చులతో కరీంనగర్ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నానని తన కుటంభ సభ్యులు సైతం గంగుల గెలుపులో పాలుపంచు కొమ్మని ఆశీర్వదించి పంపారని తెలిపారు. మనోహార్ లాంటి అభిమానిని సంపాదించుకున్న గంగుల కమలాకర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఇక్కడి ప్రజలు అనుకోవడం విశేషం.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్