30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్​తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం

​తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం

​తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం

తెలుగు మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి తెలుగు భాషపై ఉన్న చిత్తశుద్ధి, పారదర్శక పాలనకు ఇది నిదర్శనం

హర్షం వ్యక్తం చేసిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు

అమరావతి యదార్థవాది ప్రతినిధి, జనవరి 4 : రాష్ట్ర భాష, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పాలనలో పారదర్శకత ను ప్రోత్సహించడం కోసం టిడిపి కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి సర్కారు నిర్ణయం పై ఆయన స్పందించారు. తెలుగు భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమైన నిర్ణయం అని తెలిపారు. తెలుగు భాష పై టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ని, పాలన లో పారదర్శకత కు ఇది నిదర్శనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఇంగ్లీషు జీఓ లు సామాన్య ప్రజలకు అర్థం కాక ఇబ్బందులు ఎదురయ్యేవని ఇకపై ఎటువంటి చీకటి జీవో లు ఉండని.. జవాబుదారీ ప్రభుత్వాన్ని చూడబోతున్నట్లుగా భావిస్తున్నామన్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఈ ఉత్తర్వులు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలన్న నిర్ణయం కూడా కూటమి ప్రభుత్వంలో త్వరలోనే అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు భాషపై మమకారం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లకు ఈ సందర్భంగా మేడవరపు రంగనాయకులు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్