28.2 C
Hyderabad
Sunday, July 14, 2024
హోమ్తెలంగాణత్వరలో అందుబాటులో ఆర్మూర్ అర్బన్ పార్క్..

త్వరలో అందుబాటులో ఆర్మూర్ అర్బన్ పార్క్..

త్వరలో అందుబాటులో ఆర్మూర్ అర్బన్ పార్క్..

ఆర్మూర్ 24 డిసెంబరు 22

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతులమీదుగా ప్రారంభించుకుందాం..

ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను అతి త్వరలో పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పీయూసీ ఛైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు.


“నమస్తే నవనాధపురం”

కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్బన్ పార్క్ పనులను మొత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. చేపట్టిన పనులలో విజయం సాధించడం కోసం అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అధికారులకు ఉద్బోధించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతున్న దన్నారు.166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసుకొని, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ఆరు కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్క్ ఇదేనన్నారు. చిన్నపూర్ చెరువు సుందరీకరణ, పార్క్ కు మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, కల్వర్టుల నిర్మాణం వంటి పనులకు ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ అర్బన్ పార్క్ ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల పాలిట దేవుడని, ఆయన దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఆయన అభివర్ణించారు. ఈ పార్క్ నిర్మాణంలో భాగస్వాములు అయిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ పార్క్ కు ఒక రూపమిచ్చా రన్నారు. ఈ పార్కును ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు శ్రీనివాస్, సౌమ్య, అశోక్ కుమార్, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ గంగారెడ్డి, అడివి మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్