28.2 C
Hyderabad
Tuesday, April 22, 2025
హోమ్తెలంగాణదశాబ్ది ఉత్సవాలు నింగినంటేలా నిర్వహించాలి: మంత్రి హరీష్

దశాబ్ది ఉత్సవాలు నింగినంటేలా నిర్వహించాలి: మంత్రి హరీష్

దశాబ్ది ఉత్సవాలు నింగినంటేలా నిర్వహించాలి: మంత్రి హరీష్

సిద్ధిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను సిద్ధిపేట జిల్లాలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలన్నారు.- 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. నాడు-నేడు సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పదవి కాలంలో విద్యుత్ సమస్యలపై ఖర్చులు చేశారు.. తప్ప ఏమీ లేదని గత అనుభవాలు వివరించారు. గతంలో బావులు అద్దెకు తీసుకుని ట్యాంక్ ద్వారా నీరు వ్యవసాయ బావులకు సరఫరా చేసేదన్నారు.. మహారాష్ట్రలో ఇప్పటికీ తాగునీరు సరఫరా ఇబ్బందులు ఉన్నాయని, పక్కరాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలన్నారు. మాతృశిశు మరణాలు తగ్గి దేశానికే ఆదర్శంగా నిలిచామని ఇవాళ 14వ స్థానం నుంచి 3వ స్థానంలో తెలంగాణ వైద్యం చేరుకున్నదన్నారు. నిజం ప్రచారం చేయక పోతే అబద్ధాలు రాజ్యమేలుతాయన్నారు. పంట కాలాన్ని ఒక నెల ముందుకు తీసుకు వద్దామణి, రైతుల్లో ఒక మార్పు తెద్దాం. రేపట్నుంచి ప్రతీ రైతు వేదికల్లో ప్రధానంగా చర్చ జరగాలన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు, యీ రోజు జరిగిన సాగు ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిద్దామన్నారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరిపేలా అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్