దిగుతున్న ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు దిగుతుండగా మరియల భారతవ్వ అనే మహిళ కాలుజారి బస్సు కింద పడింది. ఇది గమనించకుండా బస్సును కాస్త ముందుకు తీసుకెళ్లిన ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సులో ఉన్నవారు, కింద పడ్డ మహిళా కేకలు వేయడంతో బస్సును ఆపాడు. అప్పడికే మహిళ కాలు పైకి బస్సు వెనుక టైరు ఎక్కడంతో కాలు పాదానికి తీవ్ర గాయామయ్యింది. గాయపడ్డ మహిళను చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు పోలీసులు.. వరంగల్ డిపో పల్లె వెలుగు నంబర్ TS03 UC2889 గల బస్ హనుమకొండ నుండి సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని, బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ వెల్లడించారు..