దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కణిక సాహిత్య సామాజిక సేవ విద్యారంగ వేదిక హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సాహిత్య సేవలు అందిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చెందిన కవి దేవులపల్లి రమేశ్ కు కణిక కుటుంబ ఆత్మీయ కలయిక చెత్త బండి పుస్తక ఆవిష్కరణ సభలో సాహిత్య పురస్కారం లభించింది. కణిక అధ్యక్షురాలు రమదేవి కులకర్ణి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి డా. నాగేశ్వర శంకరం నేటి నిజం పత్రిక సంపాదకులు బైసా దేవదాస్ ఐనం పూడి శ్రీ లక్ష్మి సేనధీపతి జయలక్ష్మి రవీంద్ర భారతి హైదరాబాదులో కవి దేవులపల్లి రమేశ్ ను సన్మానం చేసి అభినందించారు. దేవులపల్లి రమేశ్ మాట్లాడుతూ నా సేవను గుర్తించి నాకు సాహిత్య పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉందని సాహిత్య పురస్కారం లభించినందుకు కుటుంబ సభ్యులు కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాలను వచ్చినటువంటి కవులు కళాకారులుతదితరులు పాల్గొన్నారు.