దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివి..
* దళితులందరికి దళిత బంధు పధకం వర్తిపచేయాలి..
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యులుగా వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసి భారత ఉప ప్రధానిగా పని చేసి దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నిర్మాణ బాధ్యులు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్ అన్నారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్థానిక అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్( సిపిఐ)లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ తో కలిసి అయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బాల్యం నుండే అనేక అవమానాలను అంటరానితనంను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా ఎదురించినా ధైర్హశాలి అని ఉన్నత చదువులు చదువుకుని అతి తక్కువ వయసులో ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. సుమారుగా 55 సంవత్సరాల కాలం ఎంపీగా,కేంద్ర మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన రాజకీయ నాయకుడిగా ప్రపంచ రికార్డు జగ్జీవన్ గారికి ఉందని అన్నారు.కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పక్షపతిగా సమాచార సామాజిక న్యాయ రక్షణ వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసి అన్ని రంగాల్లో ఫలితాలు సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం యువకులు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు… కార్యక్రమం లోదళిత హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బోనగిరి శంకర్ జిల్లా నాయకులు నెలవేణి స్వప్న,కొమ్ముల శ్రీనివాస్ జేరిపోతుల జనార్దన్ జనగాం రాజ్ కుమార్ పొన్నాల స్వప్న ఇరుగు సంధ్య వడ్లూరి బాలవ్వ జంగిడి సునిత తదితరులు పాల్గొన్నారు..