30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణనాణ్యత ప్రమాణాలు పాటించాలి..జిల్లా కలెక్టర్

నాణ్యత ప్రమాణాలు పాటించాలి..జిల్లా కలెక్టర్

నాణ్యత ప్రమాణాలు పాటించాలి..జిల్లా కలెక్టర్

సిద్దిపేట:12 యదార్థవాది ప్రతినిది

ఆసుపత్రి నిర్మాణ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన..కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట జిల్లా హెడ్ క్వటార్ లో నిర్మిస్తున్న1000పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను గురువారం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. డిఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రి కి కావలసిన సూచనలు చేశారు. నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ కలెక్టర్, అధికారులకు ఆసుపత్రి సంభందిత మ్యాప్ ను చుపిస్తు పూర్తిగా వివరించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, భవిష్యత్ అవసరాల ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టామని, 1000 పడకల ఆసుపత్రి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా, భవిష్యత్తు అవసరాల అనుగుణంగా కెపాసిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లో పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయని తెలిపారు. నిర్ణీత గడువు లోపు నిర్మాణం పూర్తి చేసి అందించాలని ఏజెన్సీలకు ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ అనంతరెడ్డి, ఆర్బన్ తహసిల్దార్ విద్యాసాగర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ బాపినీడు మరియు మెడికల్ కళాశాల సిబ్బంది ఉన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్