నాలుగు నియోజకవర్గాలలో యుగ తులిసి పార్టీ తరుపున పోటీ.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ జేఏసి, యుగతులసి పార్టీ ఆధ్వర్యంలో నాలుగు నియోజకవర్గాలలో
వందలాదిగా నామినేషన్లు వేయడానికి సిద్ధమైనట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమా రెడ్డి తెలిపారు.. సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్ కామారెడ్డిలో వందలాదిగా నామినేషన్లు వేయడానికి సిద్ధమైనట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమా రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్ సిరిసిల్ల, కామారెడ్డి రిటర్నింగ్ అధికారుల నుండి నామినేషన్ పత్రాలు తీసుకున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఅర్ నియోజకవర్గం గజ్వేల్ లో యుగ తులసి పార్టీ అభ్యర్థిగా రఘుమా రెడ్డి, సిద్దిపేట అభ్యర్థిగా కమలాకర్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా గోశాలకు స్థలం కేటాయిస్తామని చెప్పి మూగజీవాలను కూడా మోసం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కిందని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడించి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు యుగ తులసి పార్టీని ఆదరించాలని కోరారు. ఈ పత్రిక సమావేశంలో యుగ తులిసి పార్టీ నేత కమలాకర్ రెడ్డి, అమర వీరుల కుటుంబ సభ్యులు మమత, సునీత, పూలమ్మ, లింగమ్మ, సరిత, ఉద్యమకారులు
శంకర్ మోహన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.