31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణనిబంధన ప్రకారం వాహనాలకు అన్ని పత్రాలు ఉండాలి..డిసిపి

నిబంధన ప్రకారం వాహనాలకు అన్ని పత్రాలు ఉండాలి..డిసిపి

నిబంధన ప్రకారం వాహనాలకు అన్ని పత్రాలు ఉండాలి..డిసిపి

మంచిర్యాల 23 డిసెంబర్ 22

వాహనాలకు రిజిస్ట్రేషన్,నెంబర్ ప్లేట్ దాచినా, కొన్ని నెంబర్లు తొలగించిన ఇకనుండి చీటింగ్ కేసులు నమోదు చేస్తామని డిసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలో మూడు రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీస్ లు వాహనం దారులకు అవగాహన కల్పిస్తూ ఇ ఛాలెంజ్ జరిమానా విధించడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు నిర్వహిస్తామని నిబంధనలకు విరుద్ధంగా, నెంబర్ ప్లేట్స్ కనపడకుండా, ఈ చాలన్స్ తప్పించుకోవడం కోసం వాసన ధారణం వాహనాలపై తప్పుడు నంబర్లను రాస్తున్నారని, కొందరు మరి ప్లేట్లపై డిజైన్లు, మాస్కులు వేస్తున్నారని గుర్తించామన్నారు. ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జూన్ పరిధిలోని ప్రజలందరూ నిబంధనల ప్రకారం వాహనాలను పేపర్లు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పకుండా వాడాలని డిసిపి తెలిపారు. కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రజలందరూ మాస్కలు ధరించాలని, కరణ్ నియంత్రణ పాటించాలని డిసిపి తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్