నిరుద్యోగ యువతకు శుభవార్త..
న్యుదిల్లి 28 డిసంబర్
ఇంటర్ అర్హతపై కేంద్ర హోం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) మొత్తం 1,458 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు తెలిపింది. వచ్చే జనవరి 4 నుండి 25వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) ఉద్యోగాలు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు 1,315 ఉన్నాయి. ఏఎస్సైలకు వేతనం రూ.29,200 – రూ.92,300, హెడ్‌కానిస్టేబుల్ రూ.25,500-రూ.81,100గా ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 25 నాటికి వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, సీబీటీ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీల్లో జరుగుతుంది. తెలుగు రాష్టాలలో దగ్గర పరీక్షా కేంద్రాలివే..అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి.