నూతన నివాస గృహ సముదాయాలను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
యదార్థవాది ప్రతినిది హైదరాబాద్
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నూతనంగా నిర్మించిన 112 నివాస గృహ సమూదాయ భవనాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ సరైన మౌలిక సదుపాయాల కల్పన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇందులో పొందుపరచిన సౌకర్యాలు వారికి అనుకూలంగా ఉంటాయని ముఖ్యంగా జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో పోలీసుల సేవలను గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దేశంలోని తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో సాయుధ దళాలు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. పోలీసుల కృషి వల్లే బాగా అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. ప్రశాంత జీవనానికి పోలీసు సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పన అవసరం అని మంత్రి తెలిపారు. పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్ అమిత్ గార్గ్ మాట్లాడుతూ గ్రూప్ బి గ్రూప్ సి సిబ్బందికి 642 క్వార్టర్లలో మొత్తం 320 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.