నేడు కామారెడ్డికి మంత్రి కెటిఆర్ రాక..

312

రూ.6 కోట్లు వెచ్చించి నిర్మించిన బీబీపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించడానికి మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి మంగళవారం కామారెడ్డి జిల్లా బీబీపేటకు రానున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా ఆధునిక హంగులతో దాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి దీన్ని నిర్మించారు. బడి విస్తీర్ణం 2.75 ఎకరాలుండగా.. 42 వేల చ.అ.ల్లో 32 సువిశాల గదులు ఉన్నాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వెంట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ప్రేంకుమార్, ఎంపీపీ బాలమణి ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి