31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణపంట వ్యర్ధాలను కాల్చొద్దు

పంట వ్యర్ధాలను కాల్చొద్దు

పంట వ్యర్ధాలను కాల్చొద్దు

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

వానాకాలంలో వరి వేసిన రైతులు పంట కోసిన తర్వాత పంట వ్యర్ధాలను తగలబెడుతున్నారు పంట వ్యర్ధాలను తగలబెట్టడంపై వాటిల్లే నష్టాలు గూర్చి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రామాయంపేట మండలం గ్రామం కిషన్ అనే రైతు పొలంలో సందర్శించిన సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ వానకాలంలో పండించినటువంటి వరి పంట పంట కోసే సమయంలో 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు కాండం ఉంచి కోయడం జరుగుతుందని ఈ విధంగా చేయడం ద్వారా పంటకు నష్టం చేసేటువంటి కాండం తోలుచు పురుగు యొక్క కోషస్థ దశలు పంటలోనే ఉండిపోయి జీవిత చక్రం పూర్తి చేసుకుని ఈ యాసంగి సీజన్లో కాండం తోలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులు వరి పంట కోసేటప్పుడు నేల అడుగుభాగం వరకు వరి పంటలు కోయాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు పంట వ్యర్థాలను, వరిగడ్డి ని పొలంలో వదిలిపెట్టి కాల్చడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా లాభాల కన్నా చాలా ఎక్కువ నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పంటకు మేలు చేసేటువంటి క్రిమి కీటకాలు, వానపాములు చనిపోవడం ద్వారా భూమిలో సేంద్రియ కర్భన పదార్థం తగ్గి భూమి యొక్క సారం దెబ్బతింటుంది ముఖ్యంగా పంటకు ఉపయోగపడేటువంటి నత్రజని భాస్వరం పొటాషియం మూలకాలు సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింక్, ఇనుము వంటి పోషకాల లభ్యత తగ్గిపోతుంది దీనివల్ల భూసారం తగ్గి పంట దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా రైతుల యొక్క ఆదాయం పడిపోయే అవకాశం ఉంది ఇందుకోసం రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా కలియ దున్నినట్లయితే అనేక లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వరి కొయ్య లను కలియ దున్నడం ద్వారా సేంద్రియ కర్భన పదార్థం పెరిగి పంట దిగుబడులను  పెంచే అవకాశం ఉంది.సేంద్రియ కర్భన పదార్థం పెరిగినప్పుడు భూమిలో పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వానపాముల జీవ సంతతి పెరిగి భూమి యొక్క సారాన్ని పెంచే అవకాశం ఉంది దీని ద్వారా రైతు యొక్క పంటల దిగుబడి పెరగడంతో పాటు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దుక్కి దున్నే సమయంలో పంట వ్యర్ధాలు కుళ్లి పోవడానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడడం వల్ల పంట వ్యర్థాలు మురగడం తో పాటుగా పంటకు  బాస్వరం ఇనుము, సల్ఫర్ వంటి  మూలకల ను అందించే అవకాశం ఉంది పంట వ్యర్ధాలను భూమిలో కలియ దున్నడం ద్వారా దాదాపుగా ఒక టన్ను ఎరువును భూమికి అందించే అవకాశం వుంది, జింకు మాంగనీస్ ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మ ధాతువులను నేలకు అందించి పంట దిగుబడి లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది నీళ్లలో కరగని మూలకాలను కరిగే విధంగా అనుకూలంగా మార్చుతుంది భూమి యొక్క నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని పెంపొందిస్తుంది మొత్తంగా కలియ దున్నడం ద్వారా పంట వ్యర్ధాలను కాల్చే విధానం కంటే కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి పంట వ్యర్ధాలు మురగడానికి వేస్ట్ డీకంపోజర్ అనే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కూడా భూమికి అందించి నట్లయితే పంట వ్యర్ధాలు కుళ్లిపోయే ప్రక్రియ వేగవంతం చేస్తుంది కావున రైతులు పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నలని మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ రాజు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్