పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో: జిల్లా కలెక్టర్
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా విద్యాశాఖ అధికారులలు విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ రాజర్షిషా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాచవరంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులతో జిల్లా ప్రధమ స్థానంలో ఉండాలని అందుకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయులు పని చేయాలని ఇందుకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఈ రెండు నెలల కాలంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల భవిష్యత్తు ఈ పదవ తరగతి పరీక్షల్లో ఉపాధ్యాయుల బాధ్యత కన్నా తల్లిదండ్రుల బాధ్యత కూడా ముఖ్యమే కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అదేమీ బ్రహ్మవిద్య కాదని మనం చేసే ప్రయత్నమే విజయలు సాధిస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్ లను సద్వినియోగపరుచుకోవాలని విద్యార్థులను పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి నీలకంఠం మాచవరం సర్పంచ్ సంధ్యారాణిఉపాధ్యాయ బృందం పదవ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.