31.2 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణపదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్

పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్

పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్

-మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

-హుస్నాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే పార్టీతోనే సాధ్యం అయింది

హుస్నాబాద్ పట్టణంలో రూ.59 లక్షలు పెన్షన్ల రూపంలో 8వేల మందికి లబ్ది

-హుస్నాబాద్ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వొడితల

హుస్నాబాద్ యదార్థవాది

గడచిన పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికే దిక్సూచిలా నిలిచింన బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు….
హుస్నాబాద్ పట్టణంలోని రాజ్యలక్ష్మి కన్వెన్షన్ లో మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం తెలంగాణాలో సాగు తాగునీరు లేదని, ఎప్పుడు వస్తుందోఎప్పుడు పోతుందో తెలియని కరెంట్ కష్టాలను అదికమించని గడచిన పదేళ్లలో ఎన్నో హామీలను సి ఎం కేసీఆర్ అమలు చేశారని ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చారని గుర్తు చేసారు.. స్వ‌రాష్ట్ర ఫ‌లాలు క‌ళ్ళ ముందు క‌న‌ప‌డుతున్నాయి. అభివృద్థి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా ఉందని, ప‌ల్లె, ప‌ట్నం,తండాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందయన్నారు. తెలంగాణ లో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్తూ, గొర్రెల పంపిణీ, గురుకుల పాఠశాలలు వంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని బీఅర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వెస్తున్నయని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రతిపక్షాల కల్లిబొల్లి కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గతంలో ఏనాడూ కనిపించని లేని నాయకులు నేడు ఓట్లకోసం కొత్త వేషాలతో వస్తారని వారికి బుద్ది చెప్తారని అన్నారు.

హుస్నాబాద్ రూపురేఖలు మార్చాం

గత పాలకుల హయాంలో హుస్నాబాద్ పట్టణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కానీ గడిచిన పదేళ్లలో హుస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళమని, హుస్నాబాద్ ను రెవిన్యూ డివిజన్ గా, నగరపంచాయతీ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశామని, ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు వచ్చాయని, కొత్త మున్సిపల్ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, బస్తి దవాఖాన ఏర్పాటు చేశామని, ఆసుపత్రి లో మాత శిశు సంక్షేమ కేంద్రం, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు.. గులాబీ పార్టీకి హుస్నాబాద్ నియోజకవర్గం కంచుకోట అని, అభివృద్ధిపై సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు గుండెకాయ అని, వారి శ్రమ, కృషి మరువలేనిదని అన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు తప్పకుండ గుర్తింపు ఉంటుందని అయన అన్నారు. ఇక్కడి పార్టీ కార్యకర్తలు నిబద్దతతో, అంకిత భావంతో, పట్టుదలతో పనిచేయడం వల్లే తాను రెండు సార్లు సి ఎం కేసీఆర్ ఆశీస్సులతో గెలిచానని, ఇది వారి కృషి ఫలితమే నని అన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే.. మరోసారి కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఉన్నారని వారిని కలవాలని కోరారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లాలని తెలిపారు.. ఆత్మీయ సమ్మేళనంతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్