పసుపు రైతులను ఆదుకోవాలి
యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్
తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి నవీన్ రెడ్డి చిన్నారెడ్డి లతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ను శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40వేల మంది రైతులు 50వేల ఎకరాలలో పసుపు పంటను చేశారని సరియైన ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని పసుపు కు మద్దతు ధర పసుపు బోర్డు తేవడంలో విఫలం అయిన నిజామాబాద్ MP అరవింద్ వెంటనే స్పందించి, రైతులకు న్యాయం చేయాలని గతంలో రెండు సంవత్సరాల క్రితం కొద్దిగా ధర వచ్చినప్పుడు, MP అరవింద్ వలనే ధర వచ్చింది. స్పెషల్ వ్యాగన్ లు పెట్టి పసుపులకు బంగ్లాదేశ్ కు ఎక్స్ పోర్టు చేయడం వల్లనే ధర వచ్చింది. అని ఆరోజు ప్రకటనలు ఇచ్చుకొన్నారు. మరి ఈరోజు 4000 వేలు 5000 కంటే ఎక్కువ ధర రావడం లేదు. ఇప్పుడు ఎక్స్ పోర్టు చేయడానికి వ్యాగన్ దొరకడం లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రప్రభుత్వం కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ఆంధ్రప్రదేశ్ లో మార్క్ ఫెడ్ ద్వారా 6800/- ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది . అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మార్క్ ఫెడ్ కు ఆదేశాలు ఇచ్చి 10.000/- మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది, కేంద్రానికి MIS క్రింద కొనుగోలుకు డిమాండ్ చేస్తూ లేఖ పంపాలి. తద్వారా మార్క్ ఫెడ్ కు జరిగె నష్టాన్ని కేంద్రం, రాష్ట్రం చేరి సగం పంచుకొనే వీలు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని అన్నారు రైతులకు న్యాయం చేయాలన్నారు