పార్టీలకు అతీతంగా అభివృద్ధి నా లక్ష్యం: ఎమ్మెల్యే
నర్సాపూర్ యదార్థవాది ప్రతినిధి
నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశంl కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలానికి సంబంధించిన ఇరు పార్టీల సర్పంచులు ఎంపీటీసీలు మండల జడ్పిటిసి సభ్యులు పాల్గొని గ్రామాల్లో ఉన్న సమస్యలని పెండింగ్లో ఉన్న పనులని పెండింగ్లో ఉండి రావాల్సిన బిల్లుల గురించి సమావేశం ద్వారా ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ పెండింగ్ బిల్లులు వచ్చే విధంగా కృషి చేస్తానని అలాగె నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.