28.2 C
Hyderabad
Tuesday, April 22, 2025
హోమ్తెలంగాణపార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లను ఓడించాలి.

*ఆ రెండు పార్టీలకు తెలంగాణపై ప్రేమ లేదు

*ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ వెనుకడుగు 

*కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు బిజెపి కాంగ్రెస్ పట్టవని కెసిఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. 4వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చారా అని నిలదీశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ అని 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తుంటే తొందరెందుకు అని కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారు అదే తాము అడుగుతున్నామని అన్నారు. మంగళవారం దుబ్బాకలో టిఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం రాలేదని నిరాశ పడవద్దు అని ఇది మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీ రామ రక్ష లాంటిదని ఎన్నో విజయాలు అపజయాలు మనకు తెలుసు బి ఆర్ ఎస్ లేకుంటే తెలంగాణ లేదని కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి ఒకటి కాదు రెండు కాదు వందల హామీలు ఇచ్చారని అన్నారు. మనమందరం ప్రజలతో కలిసి మెలిసి ఉందామని తెలుసు తెలియకో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుందామని భవిష్యత్తు మనదే కార్యకర్తలు అధైర్య పడవద్దని త్వరలో కచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారని ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైందని రెడ్డి జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్టదని అన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్