పునరావాస కేంద్రాలలో 1065 మందికి ఆశ్రయం.
జగిత్యాల యదార్థవాది
జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, సహాయ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పత్రిక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోనీ 1069 చెరువులకు గాను వర్షాల వలన 864 చెరువులు పొంగి పొర్లతున్నాయనీ, రెండు చెరువులు దెబ్బతిన్నాయని ఇప్పటివరకు ఒక ఇళ్ళు పూర్తిగా, 94 పాక్షికంగా దెబ్బతన్నాయనీ, మూడు
రోడ్లు భవనాలు శాఖ కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో
సహాయ పునరావాస కేంద్రాలు జగిత్యాల పట్టణ మండలంలో దేవశ్రీ గార్డెన్స్, పొన్నాల గార్డెన్స్, క్వాలిగడ్డ ముస్లిం కమ్యూనిటీ, రాయికల్ మండల కేంద్రం లోని ZPHS బాలుర పాఠశాల, గొల్ల పల్లి మండలంలోని బొంకూర్ యాదవ కమ్యూనిటీ, వేనుగు మట్ల గ్రామంలోని రైతు వేదిక, ఇబ్రహీం నగర్ గ్రామంలోని ZPHS పాఠశాల, మెట్ పల్లి మండల కేంద్రం లోని కీర్తి ఫంక్షన్ హాల్, ఆత్మకూరు ZPHS, మల్లా పూర్ లోని ZPHS లలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 7 పునరావాస కేంద్రాలలో 1065 మందికి ఆశ్రయం కల్పించి భోజనం, త్రాగునీరు, చద్దర్లుతో పాటు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వర్షాల వలన ఎప్పటికప్పుడు సమాచారం కోసం గానీ, సేవలకు గాను 12 ఫోన్ కాల్స్ కంట్రోల్ రూం కు రావడం జరిగింది తక్షణ సహాయం, సమాచారం అందించామని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు సేవలందించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సహకారం అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూం నెంబర్ 08724 222557 కు కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.