పేదలకు న్యాయం చేయాలి..సిపిఐ

252

పేదలకు న్యాయం చేయాలి..సిపిఐ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పై రి-సర్వే చేయాలి..
పేదల ఫిర్యాదులను స్వీకరించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలి..

హుస్నాబాద్ 26 డిసంబర్

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై మరోసారి సర్వే చేయించాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజితకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో అంటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉన్నవారికి ఓకే ఇంట్లో ఇద్దరికి కొంత మంది ఉద్యోగుల పేర్లే ఉన్నాయని గడిపె మల్లేశ్ తెలిపారు. చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చిన పేదల పేర్లు కూడా మళ్లీ జాబితాలో ఉన్నాయని, ఒక వ్యక్తికి ప్రభుత్వం నుండి ఎన్నిసార్లు లబ్ధి చేకూరుస్తారని, డబుల్ బెడ్ రూం ఇండ్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను ఇచ్చేందుకు మరో 10 రోజులు గడువు పెంచి ప్రత్యేక సమర్థ వంతులైన అధికారులచే విచారిస్తున్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం కట్టిచ్చే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరి కోసం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ న్యాయం చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, కొహెడ కొమురయ్య ఏగ్గొజు సుదర్శన్ చారి, గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి, కాల్వల ఎల్లయ్య, పోగుల నవ్య,పెద్ది నిర్మల, రాయిళ్ళు శోభ, వంగోజు భాస్కరా చారి, బిచ్చాల శ్రీనివాస్, మాడిశేట్టి శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి