పేదలకు వరం లాంటిది ముఖ్యమంత్రి సహయనిధి.
యదార్థవాది కుకునూర్ పల్లి / కొండపాక
కుకునూరుపల్లి మండల పరిధిలోని మెదనీపూర్ గ్రామానికి చెందిన పలువురికి సర్పంచ్ తాడెం దశరథం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అనారోగ్యంతో చికిత్స పొందిన మేదిన్ పూర్ గ్రామస్తులు విజయ్ కు 60000, ప్రవీణ్ రెడ్డి కి 55000, తాడం కనుకయ్య కు 60000, అక్కవ్వ 60000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంటికి పెద్దకొడుకులాగా కెసిఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని సౌకర్యాలు కల్పిస్తున్నరని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.