16.7 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణపోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జిల్లా ఎస్ పి

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జిల్లా ఎస్ పి

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జిల్లా ఎస్ పి

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

జిల్లా లోని చందుర్తి సర్కిల్ కార్యాలయంలో గురువారం పోలిస్ స్టేషన్ లో ఉన్న రికార్డులను ఫంక్షనల్ వర్తికాల్స్ పనితీరు సిబ్బంది యెక్క నామినల్ రోల్ పరిశీలించి, సర్కిల్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయిని జిల్లా ఎస్ పి అఖిల్ మహజెన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితనంగా విధులు నిర్వహించాలని స్టేషన్ వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని కేసుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బ్లూకోట్స్ పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆన్లైన్ మోసాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్ పి మహాజన్ తెలిపారు. ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణ గూర్చి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువతకు గ్రామా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నేర నియంత్రణలో సీసీ కెమెరా ల ప్రాముఖ్యత ప్రజలకు వివరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట సి.ఐ కిరణ్ కుమార్ ఎస్.ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్