ప్రజా సమస్యలే మా అజెండా.. కామ్రేడ్ వెంకట్ రెడ్డి

277

ప్రజా సమస్యలే మా అజెండా.. కామ్రేడ్ వెంకట్ రెడ్డి

*ఎర్ర జెండా పేదోళ్ల అండ..
*నిరంతరం ఉద్యమిస్తాం ప్రజాసేవకై..

హుస్నాబాద్ 26 డిసెంబర్

హుస్నాబాద్ లో ఘనంగా సీపీఐ 98 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ఎర్ర జెండాను ఎగురవేసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.. హుస్నాబాద్ అనభేరి సింగిరెడ్డి అమరుల భవనం లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మార్క్సిజమ్, లేనీనిజం సిద్ధాంతాలు అజేయమైనవని, సూర్యచంద్రులు, మానవాళి ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సీపీఐ పార్టీ లక్ష్యం అని, ఎల్లపుడు పేద ప్రజలకు అండగా సీపీఐ జెండా ఉంటుందని, సీపీఐ త్యాగాల చరిత్ర, 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు.. నాటి నుంచి నేటి వరకు గత 97 సంవత్సరాలుగా సమసమాజ స్థాపన కోసం ఉద్యమిస్తుందని, దేశ సంగ్రామంలో పాల్గొన్నదని, బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి విముక్తి కలిగించడంలో, భూమి కోసం,భుక్తి కోసం,బానిస బ్రతుకుల విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాములకు, రాజకర్లకు,పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిదాని అన్నారు. పేద ప్రజలకు10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కుడా సీపీఐ పార్టీదని, దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి అనేక ఫలితాలను భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందని, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన లో సీపీఐ భాగస్వామ్యం అయ్యిందని, ప్రభుత్వాలు అవలంబించే విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని, పేద ప్రజలకు అండగా సీపీఐ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, అయిలేని సంజివరెడ్డి, కొహెడ కొమురయ్య ఏగ్గొజు సుదర్శన్ చారి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి