27.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
హోమ్తెలంగాణప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందలి..

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందలి..

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందలి..
సిద్దిపేట 21 డిసెంబర్ 2022
తెలంగాణలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించి ప్రజాల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తు, రాష్ట్రంలో పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సామాన్య ప్రజలకు ఉండడానికి ఇల్లు లేక బిక్కుబిక్కుమంటూ జీవనం గడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు అర్హులను గుర్తించి ఉండడానికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, అధికారుల సహాయంతో అర్హులను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సొంత స్థలాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల ఇచ్చి, ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ఆసరా పెన్షన్ ఆసరాగా తీసుకొని గద్దెనెక్కినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా పెట్టుకున్న అసరా పెన్షన్లు అవి కాగితాలకే పరిమితమైన తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క లబ్ధిదారునికి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని గొప్పలు చెప్పి ఇప్పటివరకు కూడా రైతుల రుణమాఫీ చేయకపోవడం చాలా సిగ్గుచేటుతన్నారు. రైతులు బ్యాంకులలో తెచ్చుకున్న క్రాప్ లోన్ ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవడానికి అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రేషన్ కార్డు, ప్రభుత్వం ఇస్తానన్న దళిత బంధు, దళితులందరికీ వర్తింప చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండ లేకుండా ప్రభుత్వ అధికారుల ద్వారానే ఎంపిక చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కిష్టపురంలక్ష్మణ్, శంకర్, బన్సీలాల్, ఎస్కె ఆరిఫ్ పిట్ల మల్లేశం, కర్నాల చంద్రం తపనపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్