37.1 C
Hyderabad
Friday, March 14, 2025
హోమ్తెలంగాణప్రతి రైతుకు రుణమాఫీ అందాలి: మంత్రి హరీష్ రావు

ప్రతి రైతుకు రుణమాఫీ అందాలి: మంత్రి హరీష్ రావు

ప్రతి రైతుకు రుణమాఫీ అందాలి: మంత్రి హరీష్ రావు

-21లోపు జిల్లాలో రుణమాఫీ పూర్తిగా కావాలి.

-వ్యవసాయ అధికారులు ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో రైతులను గుర్తించాలి.

-మంత్రి తన్నీరు హరీష్ రావు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, జిల్లా పరిపాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మేనేజర్ సత్యజిత్, అర్ హెచ్ యుపీఐ వికాస్ ఆర్‌ఎం మాధవి, సీఎం జయంత్, ఆర్‌ఎం లక్ష్మయ్య, రజాక్, నాబార్డ్ డీడీఎం సెసిల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ తాన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో రైతులకు రుణమాఫీ కావటం లేదని ఇప్పుడు కచ్చితంగా రుణమాఫీ ప్రక్రియ జరగాలని ఈనెల 21న ఎస్ఎల్బిసి సమావేశం లోపు జిల్లాలో రుణమాఫీ పూర్తిగా కావాలని అన్నారు. రైతులకు వివిధ కారణాలతో రైతుల అకౌంటు నిలిపి వేయడంతో, ఒక బ్యాంకు ఇంకో బ్యాంకులో కావడంతో, బ్యాంకుల పేరు మారడం వలన రాష్ట్రవ్యాప్తంగా 10 వేల నుండి 12,000 రైతులు, మన జిల్లాలో 638 రైతుల అకౌంట్లు దొరుకడం లేదని, నంగునూరు మండలం పాలమాకులలో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులో కలిసిపోవడం వలన నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ ఆగిందని, రేపటినుండే బ్యాంకర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారుల సహకారంతో సంబంధిత రైతులను గుర్తించాలని ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు రైతులకు రుణమాఫీ జరిగేలా బ్యాంక్ అధికారులు సహకరించాలని జిల్లాస్థాయి బ్యాంక్ అధికారులు ఫిర్యాదులను పరిష్కరిస్తారని అన్నారు. ఇప్పటివరకు 1 లక్ష 10 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీ జరిగిందని. వారం రోజుల్లో 1 లక్ష 30 వేల రూపాయలకు రుణమాఫీ జరుగుతుందని ఎందుకు అవసరమయ్యే 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని రుణమాఫీ మొత్తం 30.09.2023 నాటికి రైతు ఖాతాలకు జమ చేయబడతాయని ఆయన తెలిపారు. వర్గల్, ఇర్కోడ్, చంద్లాపూర్, నర్మెట్టలో 4 బ్యాంక్ శాఖలను ప్రారంభించుకుండమని పెండింగ్‌లో ఉన్న 20 ట్రైకార్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ 118 యూనిట్లు, పీఎంఎస్‌వానిధి యూనిట్లు, మెప్మా బ్యాంక్ లింకేజీల పెండింగ్‌లను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్