31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్ 

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్ 

ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు: జిల్లా కలెక్టర్ 

జగిత్యాల యదార్థవాది ప్రతినిధి 

ఆరు గ్యారెంటీల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రతీ ఇంటికి  ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందని, ప్రతీ ఇంటికి ఒకటే దరఖాస్తు సమర్పించాలని  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  అన్నారు. మంగళవారం జగిత్యాల గ్రామీణ మండలంలోని  హస్నాబాద్, మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కోరుట్ల పట్టణ పరిధిలోని  ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా లబ్దిదారుల నుండి దరఖాస్తు ఫారంను స్వీకరిస్తున్న పద్దతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తదుపరి డిసెంబర్ 9 న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద వైద్య ఖర్చులకు 10 లక్షల వరకు పెంచడం జరిగిందని మిగతా 5 గ్యారెంటీలకు గత నెల 28 నుండి ఈ నెల 6 వరకు గ్రామాలు పట్టణాల్లోని అర్హులైన ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ప్రభుత్వమే ఉచితంగా గ్రామ పంచాయతి మండల, మున్సిపల్ అధికారుల ద్వారా సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. అట్టి దరఖాస్తు ఫారానికి దరఖాస్తు దారులు రేషన్ కార్డు అధార్ కార్డ్  జిరాక్స్ లు మాత్రమే జత చేసి అట్టి ఫారాన్ని పూర్తిగా నింపి కేటాయించబడిన కౌంటర్లలో సమర్పించాలని వివరించారు. గ్రామాలు, పట్టణాలు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలోనే కాకుండా ఈ నెల 6 వరకు స్థానిక పంచాయతి కార్యదర్శులకు, మున్సిపల్ అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇచ్చిన దరఖాస్తుకు రశీదు పొందాలని దరఖాస్తు దారులకు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించిన దరఖాస్తులే కాకుండా రేషన్ కార్డు భూ సమస్యలు ఇతర ఎలాంటి సమస్యలైన దరఖాస్తు రాసి ప్రత్యేక కౌంటర్లలో అందజేయవచ్చని అన్నారు. ఈ  ధరఖా స్తులన్నింటిని ఆన్ లైన్ లో పొందుపరిచి అర్హులైన లబ్దిదారులకు వంద రోజుల్లో లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. చిట్ట చివరి అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందించడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటికే గ్రామలు, పట్టణాల వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 190 టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల 85 వేల హౌజ్ హోల్డ్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 1లక్ష లక్ష 35 వేల 500 అప్లికేషన్లు పంపిణి  చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని దరఖాస్తు దారుడు ఇచ్చిన ధరఖాస్తునకు రశీదు అందజేయాలని అన్నారు.  ఆయా ప్రాంతాలలో పరిశీలించిన కేంద్రాలలో ఆర్దిఓ రాజేశ్వర్ డి.పి.ఓ దేవరాజ్ మైనింగ్ సహాయ సంచాలకులు విజయ్ కుమార్ రాథోడ్ ఆర్ అండ్ బి ఈ.ఈ. శ్రీనివాస్ ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రత్యేక అధికారులు ఆయా మండలాల ఎం.పి.డి.ఓలు తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్