28.2 C
Hyderabad
Saturday, July 13, 2024
హోమ్తెలంగాణబడ్జెట్ ప్రతుల దగ్ధం

బడ్జెట్ ప్రతుల దగ్ధం

బడ్జెట్ ప్రతుల దగ్ధం

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం బడ్జెట్ ప్రతుల దగ్ధం కార్యక్రమం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్దాల నాగరాజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది అన్నారు. రైతు సంఘం, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశాం అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కోతలు విధించడం దుర్మార్గం అని అన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంలో 2023-24 సంవత్సరానికి పంట రుణాల కింద 18 లక్షల కోట్లు రుణాలు ఇస్తామని ప్రకటించారు. గతంలో 16 లక్షలు ప్రకటించిన ఆర్థికమంత్రి ప్రకటన పత్రికలకే పరిమితం అయిందన్నారు. రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదన్నారు. మార్కెట్‌లలో కనీస మద్దతు ధరలు అమలు జరగడం లేదని ఏటా రైతులు వేల కోట్లలో నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు సంస్థలు, ప్రైవేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను దివాళా తీయిస్తున్నాయని మండి పడ్డారు. బడ్జెట్‌లో మార్కెట్‌ జోక్యం పథకం కింద 500 కోట్లు మాత్రమే కేటాయించారు. కనీసం రైతులు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అనుగుణంగా నిధులు కేటాయించినప్పటికీ తిరిగి అమ్మిన తరువాత ప్రభుత్వానికి వ్యయం చేసిన నిధులు వస్తాయి. రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకానికి 2.25 లక్షల కోట్లు కేటాయించమని డిమాండ్ చేసినా తగ్గిస్తూ పోతున్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యానికి కోతలు విధించారు.ఈ పరిస్థితులను గమనించి వ్యవసాయం, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ ను పున:పరిశీలించాలని వారు డిమాండ్‌ చేశారు. లేని యెడల దేశశ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కెవిపిఎస్ ఆర్మూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రాజు, భామండ్ల రవి, రాము, బాలే రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్