31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణబతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ

మెదక్ యదార్థవాది ప్రతినిది

రామాయంపేట పురపాలక సంఘం పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్.
మెదక్ జిల్లా రామాయంపేట పురపాలక సంఘం పరిధిలో గురువారం 12 వార్డు మహిళలకు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి కమిషనర్ ఉమాదేవి, పాలకవర్గం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లడుతూ పట్టణంలో ఉన్న 18 సంవత్సరాల నిండిన ప్రతి రేషన్ కార్డులో పేరు ఉన్న వారికి చీరల పంపిణీ చేస్తామని ఇందుకు మన పట్టణానికి సుమారు 5600 చీరలు కార్యాలయానికి వచ్చాయని సంబంధిత వార్డులలో సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఆ వార్డులలో రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని లబ్ధిదారులు సెంటర్ ల వద్దకు వెళ్లి బతుకమ్మ చీరలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్సు వార్డు అధికారులు మేనేజర్ శ్రీనివాస్ మహిళలు బీ అర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్