బస్టాండ్ తో దుబ్బాక కు కొత్త శోభ

257

బస్టాండ్ తో దుబ్బాక కు కొత్త శోభ
-త్వరలో నూతన హంగులతో బస్టాండ్ పునప్రారంభం..
-పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక 28 డిసెంబర్

దుబ్బాక పట్టణం కొత్త అందాలను సంతరించుకొనుంది. ఇక్కడ బస్టాండు పునర్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తికావస్తుండడంతో నూతన కళ సంతరించు కొనుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన దుబ్బాక బస్టాండ్, దుబ్బాక ఎన్నికలు రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత వందలాది మంది ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ మేరకు బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న దరిమిలా బుదవారం సాయంత్రం బస్టాండ్ పనులను అధికారులతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం వచ్చినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. విశాలవంతమైన స్టాపులతో నిర్మితమవుతున్న పనులు క్షుణ్ణంగా పరిశీలించి, మిగులు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
బస్టాండుకు వచ్చే ప్యాసింజర్లు-ప్రయాణీకులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్టాండులో ప్లాట్ ఫామ్స్ డిజైన్లకు అనుగుణంగా పనులు ఆర్టీసీ అధికారులు వివరించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి