బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు

280

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు

రామగుండము: 4 జనవరి

* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు…

* అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు..

* డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు…

ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (ఐజి) ప్రకటనలో అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకుఇబ్బదుల దృశ్య మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల రక్షణ కోసం నిషేధాజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01జనవరి 23, 01 పిబ్రవరి 23 కొనసాగుతాయని అన్నారు. ipc,188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజే, డ్రోన్ లపై, నిషేధాజ్ఞలు పొడగింస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి