32.2 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణబాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ

బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ

బాధితుని కుటుంబానికి 2 లక్షల చెక్కు పంపిణీ

యదార్థవాది, సిద్దిపేట:

ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదన్నా అనుకోని సంఘటాన జరిగినప్పుడు కుటుంబానికి డబ్బుల పరంగా సహకారం ఉంటుందని యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ ఈ వికాస్ రాజ్ సూచించారు. సిద్దిపేట లోని ముస్తాబద్ చౌరస్తా లో ఉన్న యూనియన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కోటగిరి శ్రీనివాస్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. కేవలం 450 రూపాయలతో ఆయన చేయించిన ఇన్సూరెన్స్ వల్ల ఆయన అకౌంట్ కి నామిని అయిన ఆయన భార్య చంద్రకళ కు బుధవారం 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన పథకాలు జీవితంలోనూ.. జీవితం తర్వాత కూడా కుటుంబాలకు తోడుగా ఉంటాయన్నారు. కేవలం 20 రూపాయలతో సురక్ష యోజనలో 2లక్షల రూపాయలు పొందవచ్చన్నారు. కేవలం రెండు రోజుల్లో ఇనురెన్సు క్లైమ్ అవుతుండని బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ హెచ్ రాఘవ్, సర్కిల్ మేనేజర్ ప్రదీప్ కుమార్,బ్రాంచ్ మేనేజర్ భారత్ సోనామాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్