31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణబీఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదు

బీఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదు

బీఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదు

-దుబ్బాకలో రైతు పక్షపాతి ముత్యం రెడ్డి కుమారుడిని గెలిపించండి.

-కాంగ్రెస్ పార్టీ కిసాల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి రావు.

దుబ్బాక యదార్థవాది ప్రతినిది

టిఆర్ఎస్ బిజెపిలు రైతులకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి రావు, జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం దుబ్బాకలో వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ మంత్రి  ముత్యంరెడ్డి దుబ్బాకలోని రైతుల కోసం అహర్నిశలు కిసాన్ సేల్ ఆధ్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని పేర్కొన్నారు కెసిఆర్ రైతు రుణమాఫీ చేయక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతు సంక్షేమం  జరిగిందని దుబ్బాకలో వడగళ్ల వానతో దెబ్బతిన పంటలకు నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇప్పడికి రూపాయి సాయం చేయలేదన్నారు. 2014 రుణమాఫీ కి సంబంధించి రీ షెడ్యూల్ చేయక స్థానిక ఓ బ్యాంకులో ఇప్పడికి మిత్తితో తీసుకున్న అప్పును చెల్లించాలని రైతుల మీద ఒత్తిడి చేస్తున్న ఇక్కడ గెలిచిన నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దివంగత నేత మంత్రిగా పనిచేసిన ముత్యం రెడ్డి  అప్పడి ముఖ్యమంత్రితో కొట్లాడి దుబ్బాక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసారని తెలిపారు.. నియోజకవర్గంలో ప్రతి మండలం ఒక్క మార్కెట్ కమిటీ టీటీడి కల్యాణ మండపలు రైతుల కోసం చెక్ డ్యామ్ లు నిర్మాణం చేసింది కేవలం ముత్యం రెడ్డి అని కొనియాడారు దుబ్బాక అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రైతు పక్షపాతి ముత్యం రెడ్డి ఆశయాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని ఇక్కడి ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడీల గోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్