భౌగోళికంగా హుస్నాబాద్ మూడు జిల్లాలతో అనుబంధం ఉంది: మంత్రి పొన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
మంత్రి క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు ఎంపీడీవోలు ఎంఇఓలు అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధియే నా ప్రథమ ప్రాధాన్యతఅని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాలతో ఉన్నదున నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. ఈనెల 20న మరో సారి అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల వివరాలపై సమీక్షిస్తానని అలోపు పూర్తి వివరాలను సేకరించాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల కేటాయించిందని వాటితో ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని మంత్రి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధానాలు వేరువేరుగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అధికారులు సేకరించి అభివృద్ధికి ఉపయోగించాలి మన ఊరు మనబడి కార్యక్రమాల ద్వారా చేపట్టిన నిర్మాణ ప్రగతి వివరాలు అందించాలి తహసిల్దార్ లు వివాదాస్పద భూముల వివరాలు భూ రిజిస్ట్రేషన్ల వివరాలు అందించాలని రవాణా శాఖ అధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజలకు హుస్నాబాద్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డిఓ బెన్ సాలెం హనుమకొండ హుజురాబాద్ ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.