25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణమంత్రిని కలిసిన దుద్దెడ పద్మశాలి కులస్థులు.

మంత్రిని కలిసిన దుద్దెడ పద్మశాలి కులస్థులు.

మంత్రిని కలిసిన దుద్దెడ పద్మశాలి కులస్థులు

యదార్థవాది న్యూస్ కొండపాక

కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ పద్మశాలిలు కులసంఘభవన నిర్మాణానికి నిధులు కావాలని కోరుతూ మంత్రి హరీష్ రావు కు వినతి పత్రం అందించిన అధ్యక్షుడు బొజ్జ మహాదేవ్. మంగళవారం మంత్రి హరీష్ రావు వెంటనే మంత్రి గడా ఛైర్మెన్ ముత్యంరెడ్డికి భవననిర్మాణానికి గాను అవసరమగునిధులు సమాకూర్చాల్సిందిగా ఆదేశించారు. అడగగానే నూతన సంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరు కోసం సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు దుద్దెడ పద్మశాలి సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొజ్జమహదేవ్, సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వడ్లకొండ శ్రీహరి, సంఘ సభ్యులతో దుద్దెడ గ్రామ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్, ఎంపీటీసీలు గురజాడ బాలాజీ, పిల్లి నాగరాజు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్, నూనె కుమార్ యాదవ్ గ్రామ బీఆరెస్ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్