30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుందాం: డీసీపీ సుదీర్ రాంనాథ్

మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుందాం: డీసీపీ సుదీర్ రాంనాథ్

మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుందాం: డీసీపీ సుదీర్ రాంనాథ్

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల జైపూర్ బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గురువారం హిందూ ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న ప్రవిత్రమైన రంజాన్ మాసంతో పాటు ఈ నెల చివరిలో వస్తున్న శ్రీరామ నవమి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎన్నో ఏళ్లుగా మతాలకు అతీతంగా గౌరవించి ప్రతి పండుగను సోదరభావంతో శాంతియుతంగా జరుపుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అన్నదమ్ముల జరుపుకుందాంమని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు సోదర భావం కలిగివుండి శాంతియుత వాతారణంలో మీడియాలో వచ్చే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అసత్య వార్తలను నమ్మి ప్రచారం చెయ్యవద్దని తెలిపారు. ఏ సమస్య వచ్చిన స్పష్టంగా మత పెద్దలు పోలీసుల దృష్టికి తీసుకు రావాలని పోలీస్ విధులు ఆటంకం కలిగించరాదని డిసీపీ కోరారు. సోషల్ మీడియాలో మతాలను కించపరుస్తూ అసత్యపు పుకార్లను సృష్టించాలని ఎవరైనాసోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన స్థానిక పోలీసులకు డయల్ 100 ఫోన్ చేసి సమాచాలని చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని చట్టానికి అందరూ సమానమేనని డిసీపీ తెలిపారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి జైపూర్ ఏసీపీ నరేందర్ బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మంచిర్యాల పట్టణ సీఐ రాజు రూరల్ సీఐ సంజీవ్ మత పెద్దలు ఎస్సైలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్