మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం అన్ని మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన ఎస్ పి
అఖిల్ మహాజన్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు. రాబోయే పండగలు రంజాన్ శ్రీరామ నవమి హనుమాన్ జయంతి పండుగలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతవరణంలో జరుపుకుందామని సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా విద్వేషపూరిత పుకార్లను నమ్మవద్దని నిజనిజాలు తెలియకుండా మనకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదని ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు పోలీసులకి సహకరించాలని తెలిపారు.
ప్రజాభద్రత లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యంఅని శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిరిసిల్ల జిల్లా ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ విస్వప్రసాద్ సి.ఐ అనిల్ కుమార్ టౌన్ మండల రెవెన్యూ అధికారి విజేయ్ ఎస్.ఐ రాజు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు..