మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..
యువత మద్యానికి బానిసై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడు..
నిజామాబాద్ 27 డిసంబర్
బాల్కొండ నియోజకవర్గం పోచంపాడ్ గ్రామానికి చెందిన జైండ్ల శ్రీకాంత్ మద్యపానానికి బానిసై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తుండేవాడని, కొన్ని రోజులనుండి పని దొరకకపోవడంతో మద్యానికి బానిసై ఇంట్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు మృతుని భార్య సునిత తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.