స్వంత నిడదులతో రోడ్డు వేయించిన..జన్నపు రెడ్డి
గ్రామస్తుల కోరిక తీర్చిన..జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి
హుస్నాబాద్ 27 డిసంబర్
హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సోమరం గ్రామపంచాయతీ, గర్రేపల్లికి స్వంత నిదులతో రోడ్డు వేయించిన బీజేపీ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి…
రోడ్డు సౌకర్యం లేఖ ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు… గ్రామస్తుల సౌకర్యం కోసం తన సొంత ఖర్చులతో రోడ్డు వేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చిరు…ఇచిన ప్రకారం మంగళవారం రోడ్డు పనులను ప్రారంబించారు. ఈ సందర్భంగా జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గ్రామం సింగపురంకి కూత వేటు దూరంలో వున్నదని, సైదాపూర్ మండలంలో రోడ్స్ ఇలా వుంటే నియోజకవర్గంలో పరిస్థితిని అర్థం అవుతుందని, గతంలో కూడా భీమదేవరపల్లి మండలం మల్లారం, మైసమ్మ వాగు గ్రామాలకు రోడ్డు వేపించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీటీసీ విజయ మొండయ్య, అకునుర్ సర్పంచ్ ముత్యాల రమణా రెడ్డి, సోమారం ఉప సర్పంచ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,జెల్ల మల్లేశం,గాజుల రమేష్, భరద్వాజ్, రఘు, అనిల్, రమేష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.