28.7 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణమన ఊరు మన బడి పథకం ద్వారా అభివృద్ధి పాఠశాలల ప్రారంభం..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పథకం ద్వారా అభివృద్ధి పాఠశాలల ప్రారంభం..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పథకం ద్వారా అభివృద్ధి పాఠశాలల ప్రారంభం..జిల్లా కలెక్టర్

జిల్లా కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎమ్ సి చైర్మన్ లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎంపిఓ, ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఎజెన్సీ, సర్పంచ్ లు అందరితో పాలనాధికారి మండలాల్లో పాఠశాలల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ….స్తానిక మంత్రి హరీష్ రావు జిల్లాలో మన ఊరు మన బడి పథకం ద్వారా అవసరమైన నిర్మాణాలు చేపట్టిన పాఠశాలను జనవరి మొదటి వారంలో ప్రారంభించడం జరుగుతుందని,మన ఊరు మన బడి పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లుతో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు ఉన్నాయి. నంగునూరు మండలం లో ఈ పథక పనులను త్వరగా పూర్తి చేసెందుకు డీఆర్డీఏ పిడి, పంచాయతీ రాజ్ ఈఈ లు పర్యవేక్షణ చేసి వేగంగా పూర్తి చేసెందుకు తగు సూచనలు చేశారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను తొలగించి గ్రామ పంచాయతీ లో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేయ్యాలని ఎంపిడిఒ, సర్పంచ్ లకు తెలిపారు. డైనింగ్ హల్ ఎస్టిమేట్ లో లోపాలు ఉంటె డిఇఓ వెరిపై చేయ్యాలన్నారు. పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలి మంచి గేట్, పైన ఆర్చ్ మైదానంలో కొంత గడ్డి కార్పెట్ పరచాలని, ఎంపిడిఒ, ఎంపిఓ లు ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ చేయ్యాలి. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం అన్నారు. మళ్లీ సమావేశంలోపు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్