మన చేతిలో మన భద్రత
యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల
మంచిర్యాల పట్టణ కేంద్రంలో సేవ్ లైఫ్ నినాదంతో టీ షర్ట్స్, హెల్మెట్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో శనివారం హెల్మెట్ ధరించని వాహనదారులకు పిల్లలతో గులాబీ పువ్వు ఇప్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మద్యం తాగి సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించలని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తప్పని సరిగా ఉండాలని తెలిపారు. జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదని మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు..