మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి స్వాదినం చేసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు…

332

ఒరిస్సా టు తెలంగాణ వయా ఆంధ్ర పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ఎం రవీంద్రనాథ్ బాబు ద్వారా నమ్మదగిన సమాచారం తో గత మూడు నెలల నుండి అక్రమ రవాణా
అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి ఆధిక మొత్తం లో గంజాయిని పట్టుకోవటం జరిగింది. దీనిలో భాగంగా గత 25 రోజులుగా అన్నీ ఏజెన్సీ ప్రాంతాలు, పోలీసు స్టేషన్ల పరిధిలో 24×7 వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా గంజాయి స్మగ్లింగ్ తగ్గినది. అయినప్పటికి గంజాయి తరలించడానికి అనేక మార్గాలను యెంచుకుంటున్న గంజాయి అక్రమ రవాణా దారులు పటిస్టమైన పైలెటింగ్ వ్యవస్తను యేర్పాటు చేసుకుని గంజాయి తరలిస్తున్నారు. గంజాయ్ తరలించడానికి మోటార్ సైకిలను, కారులను ఉపయోగిస్తూ పోలీసు స్టేషన్ ల పరిధి నుండి దాటవేస్తున్నారు. గంజాయి రవాణా జరుగుతున్న విషయాన్ని జిల్లా SP ద్వారా తెలుసుకొన్న పోలీసులు చింతూరు మండలం, మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుకుమామిడి బ్రిడ్జి వద్ద, చింతూరు సబ్-డివిజన్ ఏ.ఎస్.పి. G.కృష్ణకాంత్ చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ G. యువకుమార్ , మోతుగూడెం సబ్-ఇన్స్పెక్టర్ శ్ వి.సత్తిబాబు సిబ్బందితో చేపట్టిన వాహనాల తనిఖీలో మొత్తం 2000 కేజీల గంజాయిని ఒక ఐచర్ వ్యాన్లో 20 మూటల కొబ్బరికాయల లోడ్ వేసుకుని వాటికింద గంజాయిని లోడ్ చేసి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా సదరు వాహనానికి ముందు ఒక హెూండా 1-20 Asta కారు నెంబర్ ఏపి 37సిబి 8888 నందు ఒక వ్యక్తి సదరు గంజాయి వ్యాన్ కు హెల్పర్ గా వెల్లుచుండగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2000 కేజిల గంజాయిని, ఒక ఐచర్ వ్యాన్ (No.TS12 UA 9816), ఒక హెూండా i-20 Asta కారు (No.AP37CB-8888), 20 కొబ్బరికాయల మూటలను మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 1) కడియం గురు సాగర్, తండ్రి వేంకటేశ్వర రావు, వయస్సు 34 సం. గ్రామం కొత్తపల్లి, మండలం లింగాపురం, జిల్లా ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం, 2) పొగిడాల పర్వతాలు, తండ్రి నాగయ్య, వయస్సు 36 సం.లు.గ్రామం గంట్రావుపల్లె, మండల్ పెద్ద కొత్తపల్లి,జిల్లా నగర్ కర్నూల్ , తెలంగాణ రాష్ట్రం, 3) నైని రామరావు తండ్రి సుందరయ్య, వయస్సు22 సం.లు, గ్రామం గుర్రాలురు, మండల్చిత్రకొండ , మల్కాన్ గిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం. స్వాధీన పరుచుకున్న ప్రోపర్టీ వివరాలు: 1) 2000 KGల గంజాయి, సుమారు విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు. 2) ఒక ఐచర్ వ్యాన్ (No. TS12 UA 9816) 3) ఒక హోండా 1-20 Asta కారు(No. AP37CB-8888). 4) నగదు రు.2000/ 5) మూడు సెల్-ఫోన్లు. ఈ పట్టుకున్న గంజాయి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి