మానసికోల్లాసానికి క్రీడలు దోహదం : డీసీపీ
క్రీడలతో ఉద్యోగుల్లో స్నేహ సంబంధాల మెరుగు పడతాయి..డీసీపీ అఖిల్ మహాజన్
యదార్థవాది ప్రతినిది మంచిర్యాల
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు.. బెల్లంపల్లి లెవల్ -2 క్రీడా మైదానంలో నిర్వహించిన మంచిర్యాల జోన్ పోలీస్ అధికారుల, సిబ్బంది *మంచిర్యాల ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్* ప్రారంభోత్సవానికి డీసీపీ అఖిల్ మహాజన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.. క్రీడాకారులతో పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. మొదట డీసీపీ-XI టీమ్, ఎమ్మెల్యే -XI టీమ్ లు ఫ్రెండ్లి మ్యాచ్ ఆడడం జరిగింది. అందులో స్కోర్ సమానం అయి టై కాగా సూపర్ ఓవర్ ద్వారా డీసీపీ-XI టీమ్ గెలుపొందడం జరిగింది. డీసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి, బెల్లంపల్లి రూరల్, తాండూర్, లక్షేట్టిపేట, మంచిర్యాల, మంచిర్యాల రూరల్, శ్రీరాంపూర్, చెన్నూర్, చెన్నూర్ రూరల్ సర్కిళ్ల నుండి అధికారులు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీస్ లకు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. బుధవరం మొదటి మ్యాచ్ తాండూర్ టైగర్స్, మంచిర్యాల మాన్స్టర్స్ టీమ్ మధ్య 12 ఓవర్ ల మ్యాచ్ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, జైపూర్ ఎసిపి నరేందర్, మంచిర్యాల తిరుపతి రెడ్డి, మంచిర్యాల్ జోన్ పరిధిలో పనిచేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.