మార్మోగిన హనుమాన్ నామస్మరణ
* పట్టణమంతటా రెపరెపలాడిన కాషాయ జెండాలు..
* భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర..
యదార్థవాది ప్రతినిది మెదక్
విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో బుదవారం వీరహనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా నిర్వహించారు..
ఈ శోభ యాత్రకు జిల్లా నలు మూలల నుంచి వందలాదిగా తరలి వచ్చిన భక్త జనులు.. ప్రత్యేక వాహనాలపై శ్రీరాముడు హనుమంతుడు శివాజీ విగ్రహాలను ఊరేగింగా శ్రీ కోదండ రామాలయం నుండి పట్టణంలో రాందాస్ చౌరస్తా పాత బస్టాండ్ మీదుగా గోల్కొండ మార్కెట్ పిట్లం బేస్ చమన్ న్యూ బస్టాండ్ మీదుగా శోభాయాత్ర హనుమాన్ స్వాములు భజరంగ్ ధళ్ కార్యకర్తలు భక్తిపారవశ్యంలో నృత్యాలు భజనలు కీర్తనలునాతో పట్టణవాసులను ఆకట్టుకున్నాయి.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా డి.ఎస్.పి సైదులు పట్టణ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అర్ఎస్ఎస్ విబాగ్ కార్యనిర్వాహకులు నాగభూషణం జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పుట్టి మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.