22.2 C
Hyderabad
Sunday, March 16, 2025
హోమ్తెలంగాణముక్కోటి ఏకాదశి వైభోగం

ముక్కోటి ఏకాదశి వైభోగం

ముక్కోటి ఏకాదశి వైభోగం

 *కిటకిటలాడిన వైష్ణవాలయాలు

 *స్వామి వార్లను దర్శించున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

 *ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు

 *మెదక్ జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిట

 *పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామి

మెదక్ యదార్థవాది ప్రతినిధి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు దేదీప్యమానంగా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు. 

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ముక్కోటి ఏకాదశి పర్యదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణాలు భక్తి పారవశ్యమయ్యాయి. గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు,  శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  నరేంద్ర చార్యులు ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. 

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం  శ్రీ వెంకటేశ్వరాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ‌ సమేతంగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించారు.

ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి

మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుడిని వేడుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని స్వామి వారికి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భజన బృందం ఆలపించిన భజన కీర్తనలు రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వారం తలుపులు తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యారు భక్తులు పెద్ద ఎత్తున సాయంత్రం లక్ష పుష్పార్చన సేవ భజన సంగీత విభావరి వేద ఆశీర్వాదం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్  కౌన్సిలర్లు గాయిత్రి కల్యాణి యశోద ఆర్కే శ్రీను ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు నందిని శ్రీను పురుషోత్తం సకిలం శ్రీనివాస్ బద్రినాథ్ నగరం మల్లేశం దేవేందర్ రెడ్డి రాందేవ్ వేద‌ పండితులు రంగాచార్యులు లింగమూర్తి శర్మ వైద్య శ్రీనివాస్ శర్మ, శేషాచారి కృష్ణ మూర్తి భాను శర్మ ప్రసాదశర్మ కృష్ణ రావు  భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్